పారాలింపిక్స్‌కు కూడా అనుమానం
మాస్కో: డోపింగ్ స్కామ్ నేపథ్యంలో... రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా రష్యాపై నిషేధం విధించాలా? వద్దా? అనే అంశంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నేడు (ఆదివారం) తుది నిర్ణయానికి రానుంది. ఈ మేరకు సమావేశం కానున్న ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చలు జరపనుంది. రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) కోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిశీలించనుంది. సెప్టెంబర్‌లో జరిగే పారాలింపిక్స్‌లో కూడా పాల్గొనకుండా రష్యాపై నిషేధం విధించాలని అంతర్జాతీయ పారాలింపిక్స్ సమాఖ్య (ఐపీసీ) కొత్త డిమాండ్‌ను లేవనెత్తింది. మరోవైపు దేశం మొత్తంపై కాకుండా దోషులుగా తేలిన అథ్లెట్లపై మాత్రం నిషేధం విధించేలా ఐఓసీని ఒప్పించేందుకు రష్యా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
రష్యాపై నిర్ణయం నేడు!
Published Sun, Jul 24 2016 1:27 AM | Last Updated on Fri, Sep 28 2018 7:47 PM
Advertisement