స్ప్రింటర్ ధరమ్‌వీర్‌పై నిషేధం
న్యూఢిల్లీ: రియో ఒలిం పిక్స్‌కు ముందు డోపిం గ్‌లో దొరికిన స్ప్రింటర్ ధరమ్‌వీర్ సింగ్‌పై జా తీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. దీంతో ఈ హరియాణా అథ్లెట్ కెరీర్ ఇక ముగిసినట్టే. జూలై 11న బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్‌లో నిర్వహించిన డోపింగ్ పరీక్షలో ధరమ్‌వీర్ నుంచి శాంపిల్ తీసుకున్నారు. ఈ పోటీల్లోనే తను 20.45 సె. టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పుతూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
అరుుతే అతడిచ్చిన శాంపిల్‌లో నిషేధిత ఎనబోలిక్ స్టెరారుుడ్ వాడినట్టు తేలడంతో చివరి నిమిషంలో రియో ఒలింపిక్స్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఈ 200మీ. రన్నర్‌కు ఇది రెండో డోపింగ్ అతిక్రమణ కావడంతో ‘నాడా’ కఠినంగా వ్యవహరించింది. 2012లో జరిగిన జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్స్‌లోనూ తను 100మీ. రేసులో స్వర్ణం నెగ్గినా... డోపింగ్ టెస్టుకు దూరంగా ఉండడంతో అతడి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.