
కెన్యా అథ్లెటిక్స్ మేనేజర్ వెనక్కి..
లండన్: డోపింగ్ పరీక్షల గురించి ముందుగానే సమాచారం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడనే ఆరోపణలపై కెన్యా అథ్లెటిక్స్ మేనేజర్ మైకేల్ రోటిచ్‌ను రియో గేమ్స్ నుంచి వెనక్కి రప్పించారు. సండే టైమ్స్, జర్మనీ టీవీ చానెల్ ఏఆర్‌డీ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో అతను దొరికిపోయాడు. 10 వేల పౌండ్లు ఇస్తే డోపింగ్ చేసిన అథ్లెట్లకు టెస్టుల గురించి ముందుగానే సమాచారం చేరవేస్తానని ఇందులో తేలింది. దీంతో రోటిచ్‌ను కెన్యా అథ్లెటిక్స్ సమాఖ్య వెంటనే వెనక్కి రప్పించింది.