![Sprinter S Dhanalakshmi, Triple Jumper Aishwarya Babu Fail Dope Test - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/20/Sprinter%20S%20Dhanalakshmi.jpg.webp?itok=UPNBrW9T)
బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ స్ప్రింటర్ ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యబాబు డోప్ టెస్టులో పట్టుబడ్డారు. దీంతో వీరిద్దరు కామన్ వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నారు. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ బుధవారం నిర్వహించిన డోప్ టెస్టులో ధనలక్ష్మి నిషేధిత స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలింది. ధనలక్ష్మి కామన్ వెల్త్ గేమ్స్‌కు 100 మీటర్లు, 4x100 మీటర్ల రిలే జట్టులో ద్యుతీ చంద్, హిమా దాస్ ,శ్రబాని నందా వంటి వారితో పాటుగా ఎంపికైంది.
కాగా ధనలక్ష్మి గతేడాది 100 మీటర్ల రేసులో స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. దీంతో పాటు గత నెలలో ధనలక్ష్మి 200 మీటర్ల పరుగుల రేసులో పరుగుల చిరుత హిమదాస్‌పై విజయం సాధించింది. ఇక ఐశ్వర్యబాబు విషయానికి వస్తే.. గత నెలలో చెన్నైలో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా నాడా అధికారులు ఐశ్వర్య శాంపిల్‌ను తీసుకున్నారు. తాజాగా ఆమె కూడా నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు తేలింది. ఆమె కామన్ వెల్త్ గేమ్స్-2022కు ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్ ఈవెంట్‌లకు ఆమె ఎంపికైంది.
చదవండి: Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment