డోప్ టెస్ట్లో దొరికిన 120 మంది | Dope test for police job catches 120 in Punjab | Sakshi
Sakshi News home page

డోప్ టెస్ట్లో దొరికిన 120 మంది

Published Thu, Jul 28 2016 8:43 AM | Last Updated on Fri, Sep 28 2018 7:47 PM

డోప్ టెస్ట్లో దొరికిన 120 మంది - Sakshi

డోప్ టెస్ట్లో దొరికిన 120 మంది

120 మంది అభ్యర్థులు ఉత్ప్రేరకాలు వాడినట్లు గుర్తించారు.

లుధియానా: శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మత్తుపదార్ధాలు వాడి అడ్డంగా దొరికిపోయారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా పోలీస్ రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు డోప్ టెస్ట్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో 120 మంది అభ్యర్థులు ఉత్ప్రేరకాలు వాడినట్లు గుర్తించారు.

పక్కరాష్ట్రం హర్యానాలో ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ సందర్భంగా మత్తు పదార్ధాలు వాడిన నలుగురు అభ్యర్థులు మృతి చెందడంతో పాటు వంద మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థులకు డోప్ టెస్ట్లు నిర్వహిస్తోంది. అభ్యర్థులు మార్ఫిన్, ప్రొఫోగ్జిఫిన్, ఆంఫీటమైన్, కన్నాబిస్ లాంటి ఉత్ప్రేరకాలను వాడుతున్నట్లు పరీక్షల్లో గుర్తించారు. వీరందరి వద్ద మరో శాంపిల్ తీసుకొని పరీక్షించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవే ఫలితాలు పునరావృతమైతే.. వారిని రిక్రూట్మెంట్ నుంచి తప్పించడంతో పాటు, ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తామని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement