ఇలాంటి వాడితో పెళ్లా.. నాకొద్దు! | groom fails dope test, bride rejects to marry him | Sakshi
Sakshi News home page

ఇలాంటి వాడితో పెళ్లా.. నాకొద్దు!

Published Wed, May 3 2017 10:06 AM | Last Updated on Fri, Sep 28 2018 7:47 PM

ఇలాంటి వాడితో పెళ్లా.. నాకొద్దు! - Sakshi

ఇలాంటి వాడితో పెళ్లా.. నాకొద్దు!

గురుద్వారాలో తనను పెళ్లి చేసుకోడానికి వచ్చని వరుడు.. బాగా డ్రగ్స్ మత్తులో ఉండటంతో, ఇలాంటి వ్యక్తిని తాను పెళ్లి చేసుకునేది లేదని పెళ్లి కూతురు ఛీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన పంజాబ్‌లోని దీనానగర్ పట్టణంలో జరిగింది. గురుదాస్‌పూర్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పట్టణంలోని దసరా గ్రౌండ్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కుమార్తె సునీతా సింగ్‌కు ఇటీవల జస్‌ప్రీత్ సింగ్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. మహారాజా రంజిత్ సింగ్ గురుద్వారాలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. భారీగా ఊరేగింపుతో వచ్చిన పెళ్లికొడుకు కారులోంచి కాలు బయట పెట్టగానే అడుగులు తడబడ్డాయి. అది చూసిన సునీత.. అతడు బాగా డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని, అలాంటి డ్రగ్ అడిక్ట్‌తో తాను పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పింది. దాంతో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు షాకయ్యారు.  

లారీ డ్రైవర్ అయిన జస్‌ప్రీత్ కాలికి గాయమైందని, అందుకే అతడి అడుగులు తడబడుతున్నాయని నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించారు. కానీ సునీత మాత్రం తన నిర్ణయానికి గట్టిగా కట్టుబడింది. పెళ్లికొడుకును వెంటనే వైద్య పరీక్షలకు తీసుకెళ్లాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే, సమయానికి అక్కడి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన పరీక్షలు చేయడానికి తగిన పరికరాలు లేవు. దాంతో గురుదాస్‌పూర్‌లో ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించాల్సిందిగా ఆమె చెప్పింది. అక్కడ టెస్ట్ చేస్తే, జస్‌ప్రీత్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దాంతో గురుద్వారా సమీపంలో ఉన్న ఒక పోలీసు స్టేషన్‌లో పెళ్లికొడుకుపై సునీత ఫిర్యాదు చేసింది. చివరకు రెండు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకోడానికి అంగీకరించాయి. అంతకుముందు మార్చుకున్న బంగారు ఉంగరాలను కూడా ఎవరికి వారు తిరిగి ఇచ్చేశారు. తన కూతురు మంచి నిర్ణయం తీసుకుందని, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అతడు డ్రగ్స్ సేవించి వస్తే ఆమె ఎలా సంతోషంగా ఉంటుందని సునీత తండ్రి కమల్ సింగ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement