విండీస్ క్రికెటర్ రసెల్‌పై ఏడాది నిషేధం
డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. స్వతంత్ర డోపింగ్ నిరోధక ట్రిబ్యునల్ మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుంది.
2015లో మూడు వేర్వేరు తేదీల్లో తాను ఎక్కడ ఉన్నాడో తెలపాలంటూ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆదేశించగా, ఆ వివరాలను ఇవ్వడంలో రసెల్ విఫలమయ్యాడు. నిబంధనల ప్రకారం స్పందించకపోవడాన్ని డ్రగ్ పరీక్షలో విఫలమైనట్లుగానే భావిస్తారు. విండీస్ తరఫున రసెల్ 51 వన్డేలు, 43 టి20 మ్యాచ్‌లు ఆడాడు.