న్యూఢిల్లీ: తెలిసో... తెలియకో... డోపింగ్ ఉచ్చులో పడి శిక్ష పూర్తి చేసుకున్న క్రీడాకారులకు ఊహించని ఊరట లభించింది. ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలకు వారి పేర్లను కూడా ఇకపై పరిశీలించనున్నారు. దీంతో అమిత్ పంఘాల్‌లాంటి భారత స్టార్ బాక్సర్‌కు ‘అర్జున’ తదితర అవార్డులు దక్కనున్నాయి. 2012లో డోపింగ్ మరక వల్లే అమిత్ అవార్డులకు దూరమయ్యాడు. అయితే నిషేధకాలం పూర్తి చేసుకున్న వారినే ఎంపిక చేస్తారు.
ఈసారి టోక్యో ఒలింపిక్స్ వల్లే జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక, ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఒలింపిక్స్ పతక విజేతలకు కూడా అవకాశమివ్వాలనే ఉద్దేశంతో కేంద్ర క్రీడాశాఖ ఈ ప్రక్రియను వాయిదా వేసింది. ఇప్పటికే కమిటీని నియమించిన ప్రభుత్వం త్వరలోనే వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించి అవార్డు విజేతలను ప్రకటించనుంది.
చదవండి: భారత టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని
Comments
Please login to add a commentAdd a comment