న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల కాలంలో భారత్‌లో 379 మంది క్రీడాకారులు డోపింగ్‌లో పట్టుబడ్డారని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో మంగళవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అందించిన సమాచారం ప్రకారం 2013లో 96 మంది... 2014లో 95 మంది, 2015లో 120 మంది... ఈ ఏడాది అక్టోబరు వరకు 68 మంది క్రీడాకారులు డోపింగ్‌లో పట్టుబడ్డారని విజయ్ గోయల్ తెలిపారు.