ఇందర్జీత్ పాసయ్యాడు! | Story image for Indian athlete indarjit Singh from Financial Express Inderjit Singh cries conspiracy; second sample to be tested | Sakshi
Sakshi News home page

ఇందర్జీత్ పాసయ్యాడు!

Published Thu, Jul 28 2016 12:45 AM | Last Updated on Fri, Sep 28 2018 7:47 PM

ఇందర్జీత్ పాసయ్యాడు! - Sakshi

ఇందర్జీత్ పాసయ్యాడు!

న్యూఢిల్లీ: డోపింగ్ ఆరోపణల్లో చిక్కుకున్న భారత అథ్లెట్ ఇందర్జీత్ సింగ్‌కు బుధవారం కాస్త తెరిపినిచ్చే ప్రకటన వెలువడింది. జూన్ 29న హైదరా బాద్‌లో అతనికి నిర్వహించిన రెండో పరీక్షలో ఫలితం ‘నెగెటివ్’ గా వచ్చింది.

జూన్ 22న జరిగిన తన తొలి డోపింగ్ పరీక్షలో ‘ఎ’ శాంపిల్ పాజిటివ్‌గా తేలి రియో అవకాశాలు కోల్పోయిన షాట్‌పుటర్ ఇందర్జీత్‌కు ‘బి’ శాంపిల్ ఫలితం నెగెటివ్‌గా వస్తేనే ఊరట లభించే అవకాశముంది. జూలై 10, 11 తేదీల్లో కూడా అతనిపై నిర్వహించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. దోషిగా తేలితే అతనిపై కనీసం నాలుగేళ్ళ నిషేధం పడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement