పెద్ద సినిమాలకే పరిమితమైన థియేటర్లు | suman about cinema theaters | Sakshi
Sakshi News home page

పెద్ద సినిమాలకే పరిమితమైన థియేటర్లు

Published Wed, Mar 22 2017 11:09 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM

పెద్ద సినిమాలకే పరిమితమైన థియేటర్లు - Sakshi

పెద్ద సినిమాలకే పరిమితమైన థియేటర్లు

-సీనియర్‌ నటుడు సుమన్‌ ఆవేదన
రాజోలు : థియేటర్లు పెద్ద సినిమాలకే పరిమితయయ్యాయని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాలాజీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ బుధవారం శివకోడులో ముగిసింది. ఈ సందర్భంగా సుమన్‌ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మినీ సినిమా థియేటర్ల ఏర్పాటుకు ఆలోచించాలన్నారు. దీని వల్ల చిన్న సినిమాలకు ఆదరణ, రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఆర్టిస్టులకు ఉపాధి లభిస్తుందన్నారు. పెద్ద సినిమాల పైరసీ జరిగితే ఫ్యాన్స్‌ అడ్డుకుంటున్నారని, అదే చిన్న సినిమాల విషయంలో జరిగితే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కడలి గ్రామానికి చెందిన కె.వి.సాయికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం  షూటింగ్‌ 80 శాతం పూర్తయ్యింది. గుడిమూల, అంతర్వేది, శివకోడు, చించినాడ, చింతలపల్లిలతోపాటు కోనసీమలో పలు చోట్ల షూటింగ్‌ చేసినట్టు దర్శకుడు వివరించారు. సుమన్తో పాటు బెనర్జీ, పృథ్వీ, కృష్ణుడు తదితరులు నటించారని, మేలో విడుదల చేస్తామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement