ఎన్.శంకర్ స్టుడియోకు ప్రభుత్వ స్థలం
హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరంలో మరో సినీ స్డూడియో అందుబాటులోకి రానుంది. తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో పోరాటం సాగించిన ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ స్టూడియో నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్నారు. ఉద్యమ సమయంలో ఆయన రూపొందించిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ప్రభావం ఏమిటన్నది అందరికీ తెలిసిందే.
శంకర్ అంటే ప్రత్యేకాభిమానం కనబరిచే ముఖ్యమంత్రి కేసీఆర్ స్టూడియోకు అవసరమైన స్థలాలను ప్రతిపాదించాల్సిందిగా టీఎస్‌ఐఐసీ, రంగారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్‌గూడ సర్వే నం.149లో ఎనిమిది ఎకరాలను శంకర్‌కు కేటాయించేందుకు టీఎస్‌ఐఐసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. అదే సమయంలో ఖానామెట్‌లోని సర్వే నం.41/14లో పది నుంచి పదెకరాలను ప్రతిపాదిస్తూ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. ఈ రెండు స్థలాల్లో ఏదో ఒకదానిని ఖరారుచేస్తూ అతి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.
టూ స్టేట్స్ రీమేక్: హిందీలో సూపర్ హిట్ అయిన ‘టూ స్టేట్స్’ సినిమాను ఎన్.శంకర్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న తెలుగు టూ స్టేట్స్‌లో సునీల్ హీరో.