‘తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించాల్సిందే’ | drugs racket in tollywodd:we will co-operate with SIT enquiry, says producer c.kalyan | Sakshi
Sakshi News home page

‘తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించాల్సిందే’

Published Fri, Jul 14 2017 3:34 PM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM

drugs racket in tollywodd:we will co-operate with SIT enquiry, says producer c.kalyan

హైదరాబాద్‌ : తప్పు చేసినవారు శిక్ష అనుభవించాల్సిందేనని నిర్మాత సి.కల్యాణ్‌ అన్నారు. టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్‌ వ్యవహారంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరోతో పాటు దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. ఈ వ్యవహారంపై సి. కల్యాణ్‌ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ  సిట్‌ విచారణకు తాము సహకరిస్తామన్నారు.

ఇండస్ట్రీలో కొందరికి నోటీసులు మాత్రమే వచ్చాయన్నారు. అయితే నోటీసులు అందుకున్నంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా డ్రగ్స్‌ వ్యవహారంలో తమకు నోటీసులు అందిన మాట వాస్తవమేనని పలువురు అంగీకరించారు. విచారణకు హాజరై తమకు తెలిసిన విషయాలు చెబుతామన్నారు. కాగా డ్రగ్స్‌కేసులో ఇవాళ మరికొందరి పేర్లు వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

drugs racket, tollywood, C.kalyan,enforcement, cine celebrities, డ్రగ్స్‌ కేసు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు, సినిమా ప్రముఖులు, టాలీవుడ్‌, సి.కల్యాణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement