ప్రేమ వ్యవహారంలో హెచ్చరించాడనే... | new twist in kadireshan murder case | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారంలో హెచ్చరించాడనే...

Published Fri, Feb 9 2018 6:48 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

new twist in kadireshan murder case - Sakshi

విషణ్ణవదనంతో రేఖ, బంధువులు(ఇన్‌సెట్‌లో) కదిరేశన్‌ దంపతులు

యశవంతపుర: బీబీఎంపీ ఛలవాదిపాళ్యం బీజేపీ కార్పొరేటర్‌ రేఖ భర్త కదిరేశ్‌ (49) హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్‌ ప్రేమ విషయంలో తల దూర్చినందుకే సినీ ఫక్కీలో హత్య చేసినట్లు ప్రచా రం జరుగుతోంది. బుధవారం సాయంత్రం జరిగిన హత్య కేసుకు సంబంధించి... దగ్గర సంబంధం యువతితో నిందితుడు నవీన్‌ కొద్ది కాలంగా ప్రేమ వ్యవహా రం నడుపుతున్నాడు. యువతిని దొంగపెళ్లి చేసుకో వాలని భావించాడు.

విషయం తెలుసుకున్న కదిరేశన్‌ ఇటీవల నవీన్‌తోపాటు అతని స్నేహితులను ఇంటికి పిలిపించుకుని తనదైన శైలిలో హెచ్చరించి పంపాడు. ఇది కదిరేశ్, నవీన్‌ల మధ్య ఘర్షణకు దారితీసింది. దీని వెనుక పాతరౌడీ పీటర్‌ హస్తం ఉన్నట్లు సమాచారం. జై లు నుండి స్కెచ్‌ వేసి కదిరేశ్‌ను హతమార్చినట్లు తెలు స్తోంది. తన స్నేహితుడు వినయ్‌ను తీసుకొచ్చి ఒక్కసారిగా గొంతుపై చాకుతో పొడిచి హత్య చేయించినట్లు విచారణలో తేలింది. బుధవారం రాత్రి మృతదేహనికి విక్టోరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

హంతకుల అరెస్టుకు నాలుగు బృందాలు: హోంమంత్రి రామలింగారెడ్డి
బీజేపీ నాయకుడు కదిరేశ్‌ హత్య కేసుకు సంబంధించి నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి విక్టోరియా ఆస్పత్రిలో మృతదేహన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చామరాజపేటలో కదిరేశ్‌ ఇంటి వద్దనే హత్య జరిగిందని ఇందులో నవీన్, వినయ్‌లు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో బయట పడిందన్నారు. కదిరేశ్‌ హత్య కేసు నిందితులను త్వరగా అరెస్టు చేస్తామని పశ్చిమ విభాగం అడిషనల్‌ పోలీసు కమిషనర్‌ బీకే సింగ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement