
ప్రతీకాత్మక చిత్రం
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపుపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు యనమల, చినరాజప్ప, నక్కా ఆనందబాబు ,సమాచార శాఖ కమీషనర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. సమాచార శాఖ కమీషనర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ..టికెట్ల ధరలు పెంచాలని థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ధరలు పెంచే ఆలోచన ఉందన్నారు. జీఎస్టీ వచ్చాక థియేటర్లపై భారం పడిందని వెల్లడించారు. జీఎస్టీ తగ్గించాలని కౌన్సిల్‌కు లేఖ రాస్తానని చెప్పారు. వచ్చే నెల 14న టికెట్ల ధరలు ఎంత పెంచాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment