► చిరంజీవి నటించి, కో–ప్రొడ్యూసర్‌గా చేసిన ఒక సినిమాకి ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్’ అనే జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమా పేరేంటì ?
ఎ) స్వయంకృషి బి) ఆపద్భాందవుడు సి) యద్ధభూమి డి) రుద్రవీణ
► మహేశ్ బాబు నటి నమ్రతను ఏ సినిమా టైమ్‌లో పెళ్లి చేసుకున్నారో గుర్తు తెచ్చుకోండి.
ఎ) వంశీ బి) బాబి సి) అతడు డి) నాని
► నటి భానుప్రియ 150 సినిమాలకు పైగా చేశారు. ఒకే సంవత్సరంలో ఆమెవి 14 సినిమాలు రిలీజయ్యాయి. అది ఏసంవత్సరమో కనుక్కోండి.
ఎ) 1985 బి) 1986 సి) 1983 డి) 1987
► ఎస్.ఎస్. రాజమౌళి మొదట సినిమాకు సంబంధించిన ఏ శాఖలో శిష్యరికం చేశారో తెలుసా?
ఎ) అసిస్టెంట్ డైరెక్టర్ బి) కెమెరా అసిస్టెంట్ సి) అసిస్టెంట్ ఎడిటర్ డి) అసిస్టెంట్ రైటర్
► చదువుకున్న అమ్మాయిలు’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రైటర్‌గా చేసి, ఆ తర్వాత తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడయ్యారు. ఆయనెవరు?
ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) కె.విశ్వనాథ్ డి) ఎ.కోదండరామిరెడ్డి
► గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం 2012లో ఒక ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు. ఆ అవార్డు ఏమిటి?
ఎ) పద్మశ్రీ బి) పద్మభూషణ్ సి) పద్మవిభూషణ్ డి) దాదాసాహెబ్ ఫాల్కే
► నటుడు కోట శ్రీనివాసరావు సినీరంగంలోకి రాకముందు ప్రభుత్వోద్యోగి. ఆయన ఏ శాఖలో పనిచేసే వారో తెలుసా?
ఎ) బ్యాంకింగ్ రంగం బి) రోడ్లుభవనాలు సి) వాటర్ వర్క్స్ డి) ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్
► ఈ నలుగురిలో ఒక నటి అసలు పేరు సుజాత నిడదవోలు. ఈమె తెర పేరు కూడా కనుక్కుంటారా?
ఎ) జయప్రద బి) జయసుధ సి) జయలలిత డి) జయచిత్ర
► ‘కళాశాలలో... కళాశాలలో కాదా మనసొక ప్రయోగశాల...’ పాటను రాసిందెవరో చెప్పుకోండి చూద్దాం?
ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) జొన్నవిత్తుల సి) అనంత శ్రీరాం డి) సీతారామ శాస్త్రి
► డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఏ హీరోయిన్‌కు తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ వాయిస్ ఇవ్వడం ద్వారా ఫేమస్ అయ్యింది?
ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) తమన్నా సి) సమంత డి) అదా శర్మ
► హీరో నాని ట్విట్టర్ ఐడీ ఏంటో తెలుసా?
ఎ) మై నేమ్ ఈజ్ నాని బి) నాని ఈజ్ మై నేమ్ సి) నేమ్ ఈజ్ నాని డి) యువర్స్ నాని
► నాగార్జునకు నటి, నిర్మాత సుప్రియ మేనకోడలు.మరి సుప్రియకు అఖిల్ ఏమవుతాడు?
ఎ) మరిది బి) కొడుకు సి) అల్లుడు డి) బావ
► సావిత్రి తన 31 సంవత్సరాల సినీ కెరీర్‌లో అన్ని భాషలలో కలిపి ఎన్ని సినిమాల్లో నటించారు?
ఎ) 264 బి) 275 సి) 233 డి) 245
► కొరటాల శివ డైరెక్షన్‌లో చేసిన ‘మిర్చి’లో ప్రభాస్ ‘కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరూ వాడలేరు..’ అని చెప్పిన డైలాగుని రాసిన దర్శకుడెవరు?
ఎ) దశరథ్ బి) వంశీ పైడిపల్లి సి) కొరటాల శివ డి)బోయపాటి శ్రీను
► మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో కమలహాసన్ ఓ కెమెరామేన్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయనెవరు? చిన్న క్లూ.. తర్వాత కాలంలో వారిద్దరూ చాలా సినిమాలకు వర్క్ చేశారు?
ఎ) చోటా కె. నాయుడు బి) పి.సి. శ్రీరాం సి) వి.ఎస్.ఆర్ స్వామి డి) కె.వి.ఆనంద్
► నటి కాజల్ కన్నడ భాషలో గాయనిగా కూడా చేశారు. ఆమె పాడిన పాటకు సంగీత దర్శకుడు ఎవరో తెలుసా?
ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) అనూప్ రూబెన్స్ సి) ఎస్.ఎస్ తమన్ డి) సాయి కార్తీక్
► మగధీర’ సినిమాలోని బైక్ యాక్షన్ సీక్వెన్స్‌లో జరిగిన ప్రమాదంలో ఏ ఫైట్ మాస్టర్ తీవ్ర గాయాల పాలయ్యాడు?
ఎ) విజయన్ బి) స్టంట్ శివ సి) విజయ్ డి) పీటర్ హెయిన్
► విజయనిర్మల తను నటించి, మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఏంటి?
ఎ) రంగుల రాట్నం బి) మీనా సి) సాక్షి డి) పిన్ని
► పై ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టగలరా?
ఎ) కృష్ణకుమారి బి) రమాప్రభ సి) శ్రీలక్ష్మి డి) షావుకారు జానకి
► నందమూరి తారక రామారావు నటించిన ఈ ఫోటో ఏ సినిమాలోనిది?
ఎ) కృష్ణావతారం బి) కృష్ణ పాండవీయం సి) కృష్ణార్జున యుద్ధం డి) కృష్ణలీలలు
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) డి 2) సి 3) ఎ 4) సి 5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) సి 11) సి 12) ఎ 13) ఎ) 14) సి 15) బి 16) సి 17) డి 18) బి 19) సి 20) ఎ