దశమికి ‘దిల్‌’ రాజు చిత్రానికి! | Dil Raju combination with Raj Tarun | Sakshi
Sakshi News home page

దశమికి ‘దిల్‌’ రాజు చిత్రానికి!

Published Tue, Sep 12 2017 2:45 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

దశమికి ‘దిల్‌’ రాజు చిత్రానికి! - Sakshi

దశమికి ‘దిల్‌’ రాజు చిత్రానికి!

.. కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమవుతున్నారీ హీరో, దర్శకుడు! రాజ్‌తరుణ్‌ హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్‌ అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారనే వార్త ఎప్పట్నుంచో ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడీ సిన్మా సెట్స్‌పైకి వెళ్లే టైమ్‌ వచ్చేసింది. విజయదశమికి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి, వెంటనే చిత్రీకరణకు వెళ్లాలనుకుంటున్నారు.

మలయాళీ అమ్మాయి, తెలుగు అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం. సంజన దర్శకత్వంలో ‘రాజుగాడు’తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న మరో సినిమాలోనూ రాజ్‌తరుణ్‌ నటిస్తున్నారిప్పుడు. ఈ మూడు చిత్రాల తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం’ సిన్మాల ఫేమ్‌ విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మించే సినిమాను అంగీకరించారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement