
శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. సినీ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే కథానాయకుడు నారా రోహిత్ కూడా తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా 'కేరింత' సినిమా బృందం (దిల్ రాజు) కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.