
తిరుమలలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం పలువురు ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకున్నారు. నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవారిని దర్శించుకున్నారు. కథానాయకుడు నారా రోహిత్ తిరుమల చేరుకొని స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అసుర సినిమా విజయంలో భాగంగా స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు రోహిత్ తెలిపారు. 'కేరింత' సినిమా బృందం కూడా స్వామి వారిని దర్శించుకుంది.