తిరువొత్తియూరు(చెన్నై): సినిమాలో హీరోయిన్ అవకాశం ఇప్పిస్తాను.. అందుకు నేనడిగినంత డబ్బులు ఇవ్వాలని ఓ యువతి వద్ద పలు లక్షలు మోసం చేసిన దుండగుల కోసం పొలీసులు గాలిస్తున్నారు. చైన్నె టీనగర్ ప్రకాశం రోడ్డులో ప్రసిద్ధ సినిమా నిర్మాణం ఈ క్రియేషన్ పేరుతో సంస్థ నడుపుతున్నారు. కొత్త సినిమాలకు నటీనటులు కావాలని కొందరు ప్రచారం చేస్తూ సంప్రదించిన యువతీయువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు.
3 నెలలు గడిచినా కొత్త సినిమాలో నటించడానికి తమకు పిలుపు రాలేదని మోసపోయిన యువతులు కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న చిత్ర నిర్మాణ సంస్థ డైరెక్టర్ జగదీశన్ (50)ను ప్రశ్నంచగా తమ సంస్థ తరపున నటించడానికి ఎవరినీ ఎంపిక చేయలేదని వారితో చెప్పారు. తాము ఎటువంటి ప్రకటనలను ఇవ్వలేదని అని చెప్పాడు. అది విని షాక్ తిన్న యువతీ, యువకులు ఏమి చేయాలో తోచలేదు. దీనిపై ఈ క్రియేషన్‌న్స్ కో–డైరెక్టర్ జగదీశన్ యువతులకు ఇచ్చిన సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా తేనాంపేట పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు యువతుల నుంచి డబ్బులు తీసుకుని పోలీసులను మోసం చేసిన అనుమానితుల సెల్‌ఫోన్ నంబర్లను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment