హీరోయిన్ కావాలని జనాలకు టోకరా....!
హైదరాబాద్: సినిమా హీరోయిన్‌గా వెండి తెరపై వెలిగిపోవాలని కలలు కంటూ నగరానికి వచ్చిన ఆ యువతి అవకాశాలు రాకపోవడంతో తానే ఓ సినిమా నిర్మించి, అందులో హీరోయిన్‌గా నటించాలనుకుంది. సినిమా తీయాలంటే డబ్బు కావాలి కదా...అందుకోసం జనాలను నిండా ముంచే ఎత్తుగడ వేసింది. ఇంకేముంది..ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని ఇద్దరూ కలిసి ‘కమీషన్ల’ దందా మొదలెట్టారు. తమ వద్ద పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం క మీషన్ ఇస్తామని అమాయకులకు ఆశ చూపించి సుమారు రూ. 10 కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు భర్త శ్రీనివాస్‌రావును అరెస్టు చేయగా, భార్య సురేఖ పరారీలో ఉంది. కాగా, వీరి చేతిలో మోసపోయిన వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. మంగళవారం పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.