హైదరాబాద్: ఓయూ భూములు లేకుంటే రైల్వే భూములు కొనుగోలు చేసైనా ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్శిగుట్టలో బౌద్ధ నగర్లో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్పై ఈ నెల 19న ఎంసీ హెచ్ ఆర్డీ కీలక సమావేశం ఉంటుందని తెలియజేశారు. ట్రాలీ ఆటోలతో చెత్త తరలిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ క్లీన్ సిటీకి మహిళలు సారథ్యం వహించాలని కోరారు. ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు అందిస్తామని హామీ ఇచ్చారు.