వడదెబ్బకు 44 మంది బలి | Sunstroke To 44 peoples dead | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు 44 మంది బలి

Published Tue, May 26 2015 4:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

వడదెబ్బకు 44 మంది బలి

వడదెబ్బకు 44 మంది బలి

ఉగ్రరూపం దాల్చుతున్న సూర్యుడు జనాన్ని బలితీసుకుంటున్నాడు. పసిముద్ద నుంచి పండుటాకుల వరకు రాలిపోతున్నారు. వడదెబ్బ, వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గార్లలో ఆరు నెలల పాప మృత్యువాతపడింది. ఓ తునికాకు కార్మికురాలు,  ఓ వ్యవసాయ కూలీ, ఓ కొబ్బరి బోండాల వ్యాపారిని మృత్యువు వడదెబ్బ రూపంలో కబళించింది. కొందరు ఎండకు సొమ్మసిల్లి అక్కడికక్కడే మృతిచెందారు. అస్వస్థతకు గురై కొందరు నిద్రలోనే తనువు చాలించారు. జిల్లాలో సోమవారం 44 మంది మృతి చెందారు.
 
సొసైటీ మాజీ డెరైక్టర్...
నేలకొండపల్లి: మండలంలోని మండ్రాజుపల్లి సోసైటీ మాజీ డైరె క్టర్ లావూరి బద్ధు (67) వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మధిరలో కొబ్బరిబోండాల వ్యాపారి
మధిర: మధిర పట్టణంలోని బాపూజీ రోడ్డుకు చెందిన కొబ్బరి బోండాల వ్యాపారి ఎండీ ఇబ్రహీం(40) ఎండ తీవ్రతతో సోమవారం మృతిచెందాడు.  మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
కామేపల్లిలో వృద్ధురాలు

కామేపల్లి: మండల పరిధిలోని ఊట్కూర్ గ్రామంలో గూడూరు రామసూర్య(70) ఆదివారం తీవ్ర వడదెబ్బకు గురై అర్ధరాత్రి మృతి చెందింది.
 
అశ్వారావుపేటలో ఒకరు
అశ్వారావుపేట రూరల్: మండల పరిధిలోని వినాయకపురం కాలనీ గ్రామానికి చెందిన ఎస్‌కే మస్తాన్ (50) సోమవారం ఉదయం కూలీ పనులకు వెళ్లి తిరిగి మధ్యాహ్నా సమయంలో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన కొంత సమయానికి ఆయన సొమ్మసిల్లి పడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు.
 
పాల్వంచలో వ్యవసాయ కూలీ..
పాల్వంచ రూరల్: మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దారావత్ దస్మా (46) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తోంది. సోమవారం కూలీ పనికి వెళ్లి అస్వస్థతకు గురైంది. ఇంటికి వచ్చి పడుకుంది. నిద్రలోనే దస్మా మృతిచెందింది.
 
ఎర్రుపాలెంలో ఇద్దరు..
ఎర్రుపాలెం : మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన గంగారపు నాగయ్య (67) వడదెబ్బతో మృతి చెందాడు. ఈయన పొలంలో ఎరువులు వేస్తుండగా స్పృహ కోల్పోయాడు. ఇంటికి తీసుకొచ్చి ఆర్‌ఎంపీ వైద్యునితో ప్రథమ చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు వెన్నపూస నాగరత్నమ్మ(101) ఎండ తీవ్రత తట్టుకోలేక మృత్యువాత పడింది.
 
సత్తుపల్లిలో ఒకరు..
సత్తుపల్లి : మండలంలోని  కిష్టాపురం గ్రామానికి చెందిన గుడిమెట్ల సత్యావతి(54) సోమవారం వడదెబ్బకు గురై మృతి చెందింది.
 
బయ్యూరంలో ఒకరు

బయ్యారం:  మండలంలోని గంధంపల్లి గ్రామానికి కన్నేటి వెంకటేశ్వరరావు(65) ఎండతీవ్రత మూలంగా అస్వస్థతకు గురై మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
 
బూర్గంపాడులో ముగ్గురు

బూర్గంపాడు : మండల కేంద్రం బూర్గంపాడులో గౌతమిపురం కాలనీకి చెందిన పెరుమాళ్ల సురేష్(32) గతరెండురోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఇంటి వద్ద చికిత్సలు జరిపిస్తున్న క్రమంలో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బూర్గంపాడుకు చెందిన దడిగల నాగేశ్వరరావు(50) సోమవారం వడదెబ్బతో మృతిచెందాడు. గత మూడురోజులుగా తీవ్రఅస్వస్తతకు గురైన ఆయన సోమవారం ఉదయం మృతిచెందాడు. వేపలగడ్డ గ్రామానికి చెందిన వర్సా పెదనాగయ్య(55) వడదెబ్బకు గురై సోమవారం సాయంత్రం మృతిచెందాడు. ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లి వడదెబ్బకు గురైన నాగయ్య చికిత్స పొందుతు సోమవారం సాయంత్రం మృతిచెందాడు.
 
మణుగూరులో ఒకరు..
మణుగూరు: మండలంలోని రామానుజరవం పంచాయతీ చిక్కుడుగుంట గ్రామానికి చెందిన దార్ల నాగభూషణం(52)ఆదివారం మధ్యాహ్నం పని పక్క గ్రామానికి వెళ్లొచ్చాడు. సాయంత్రం కొంత నలతగా ఉందని అన్నం తిని పడుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికి నిద్ర లేవక పోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు.
 
అశ్వారావుపేటలో ఇద్దరు..
అశ్వారావుపేట రూరల్:  మండల పరిధిలోని పేరాయిగూడెం గ్రామానికి చెందిన తగరం లక్ష్మి (55) వడ దెబ్బకు గురై పరిస్థితి విషమించి మృతి చెందింది. వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై పట్టణంలోని  కాళింగుల బజార్‌కు చెందిన పౌడి సూర్యనారాయణ (56) మృతి చెందాడు.
 
గుండాలలో ఒకరు
గుండాల : మండలంలోని ఆళ్లపల్లి గ్రామానికి చెందిన సత్యమోజు వీరాచారి(45) వడదెబ్బతో మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయూడు. ఆదివారం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించినప్పటికి తగ్గలేదు.  సోమవారం తెల్లవారు జామున మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
వెంకటాపురంలో ఒకరు..
అశ్వాపురం:  మండలంలోని తుమ్మల చెరవు గ్రామపంచాయతీ వెంకటాపురం గ్రామంలో కాకాటి అచ్చయ్య(75) వడదెబ్బతో మృతి చెందాడు.
 
ఏన్కూరులో ఒకరు
ఏన్కూరు:  మండల పరిధిలోని ఆరికాయలపాడుకు చెందిన కూరపాటి చిన్నబుచ్చయ్య(60) తన భార్య జయమ్మతో కలిసి సోమవారం మధ్యాహ్నం కాలినడకన కొణిజర్ల మండలం శ్రీనివాసనగర్‌కు వెళ్లాడు. తిరిగివస్తుండగా మార్గమధ్యంలో దాహం వేసి పెదవాగులో చెలిమి వద్దకు వెళ్లాడు. కళ్లు తిరిగి అక్కడే కూప్పకూలి మృతి చెందాడు.  మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
పెనుబల్లిలో ముగ్గురు

పెనుబల్లి :  పెనుబల్లికి చెందిన నాగుబండి అనరసూర్య (70), లింగగూడేనికి చెందిన నల్లమోతు రాఘవమ్మ (70), పార్థసారథిపురానికి  చెందిన బెల్లంకొండ కోటమ్మ (68) వడదెబ్బకు గురై మృతి చెందారు.
 
కల్లూరులో ఒకరు
కల్లూరు: కల్లూరు మండలం చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రావికంపాడు గ్రామానికి చెందిన యడవల్లి వెంకటయ్య (65) వడదెబ్బకు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య రుక్మిణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
కూసుమంచిలో ఇద్దరు..
కూసుమంచి:  మండలంలో వడదెబ్బకు గురై సోమవారం ఇద్దరు మృతిచెందారు.   గోరీలపాడుతండాకు చె ందిన బాణోత్ భీక్యా (55) వడగాలులకు తట్టుకోలేక మృతిచెందాడు. ఇతని భార్య  కమలి గత నాలుగేళ్లుగా మంచానికే పరిమితం కాగా ఇతనే ఆమెకు సపర్యలు చేస్తూ , తండాలో అన్నం అడుక్కుంటూ తనతో పాటు భార్యను సాకుతున్నాడు. వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందాడు.  వీరికి ఇద్దరు అబ్బాయిలు కాగా  ఒకరు మృతి చెందాడు. మరొకరు వికలాంగుడు. దీంతో తండాలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
 
భగవత్‌వీడులో...
మండలంలోని భగవత్‌వీడుకు చెందిన  భూక్యా మారోని (70  వడదెబ్బకు తాళలేక మృతిచెందింది. ఆమె గత రెండు రోజులుగా అస్వస్థతకు గురైంది.

వేంసూరులో ముగ్గురు
వేంసూరు :  మండల కేంద్రమైన వేంసూరుకు చెందిన కోట సుందరం(70), కందుకూరు గ్రామానికి చెందిన బూరుగు లక్ష్మయ్య(79), వెంకటాపురం గ్రామానికి చెందిన పాల సరసమ్మ(80) వడదెబ్బతో మృతి చెందారు.
 
పడుకున్న మహిళ పడుకున్నట్లుగానే..
ఖమ్మం అర్బన్: ఖమ్మం శివారులోని ధంసలాపురం కాలనీకి చెందిన చింతల బుచ్చమ్మ(70) సోమవారం మధ్యాహ్నం ఆరుబయట పడుకుని అలానే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
 
వృద్ధుడి మృతి
భద్రాచలం టౌన్: వడదెబ్బకు పట్టణంలోని కొత్త కా లనీకి చెందిన సుంకర సత్యనారాయణ (65) మృతి చెందాడు. గత వారం రోజులుగా వీస్తున్న వడగాల్పులకు సత్యనారాయణ ఆది వారం జ్వరంతో పాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.  దీంతో పట్టణంలోని ఓ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ఆదివారం చికిత్స అందచేశారు. పరిస్థితి విషమించిందని ఆసుపత్రి వర్గాలు కొత్తగూడెం ఆసుపత్రికు రిఫర్ చేశారు. దీంతో అంబులెన్స్‌లో తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు.
 
ముదిగొండలో ఒకరు
ముదిగొండ:  మండల పరిధిలోని కమలాపురంలో తెల్లాకుల వెంకట్రావమ్మ(75) వడదెబ్బతో మృతి చెందారు. సోమవారం వెంకట్రావమ్మ మృతదేహాన్ని స్థానిక సర్పంచి బత్తుల వీరారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు వాక రామతారక సందర్శించి నివాళులు అర్పించారు.
 
చండ్రుగొండలో ఇద్దరు..
చండ్రుగొండ : మండలంలోని పోకలగూడెం గ్రామంలో వడదెబ్బతో ఎదుళ్ళ అప్పయ్య (60) మృతి చెందాడు. పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన అప్పయ్య నాలుగురోజుల క్రితం అతడి పెద్దకూతురు ఇంటికి పోకలగూడెం వచ్చాడు.ఈ క్రమంలో వడదెబ్బకు గురై మరణించాడు. మృతుడికి భార్య నాగరత్నం, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చండ్రుగొండలోని ఎస్సీకాలనీకి చెందిన కుంపటి సుందరం (55) వడదెబ్బతో మృతి చెందాడు. అతడికి భార్య సీతమ్మ, నలుగురు పిల్లలు ఉన్నారు.
 
తిరుమలాయపాలెంలో ఇద్దరు...

తిరుమలాయపాలెం: మండలంలోని చంద్రుతండా గ్రామంలో బోడ రుక్కి(68) వడదెబ్బతో మృతి చెందింది. మృతురాలికి  కుమారుడు ఉన్నాడు. బచ్చోడుతండా గ్రామానికి చెందిన భూక్యా దుబ్లో(48) వారం రోజుల క్రితం వడదెబ్బ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం ఆరోగ్యం పూర్తిగా విషమించి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య జమ్మా, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
కొత్తగూడెంలో...
కొత్తగూడెం అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్‌బస్తీకి చెందిన మాటేటి మల్లయ్య(70) గత మూడు రోజుల నుంచి వడదెబ్బ తాకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం మృతి చెందాడు.మండల పరిధిలోని కారుకొండ రామవరానికి చెందిన కూలీ తడికమల్లా నారాయణ(40) వడదెబ్బ తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించాడు.  గాజులరాజం బస్తీలో చిత్తు కాగితలు సేకరించే ఏసు(35) రోజు స్థానిక కమ్యూనీటి హాల్‌లో రాత్రి సమయంలో పడుకునే వాడు. ఎండదెబ్బ తగిలి సోమవారం కమ్యూనిటీ హాల్‌లోనే చనిపోయాడు.
 
వడదెబ్బతో స్వామి శారదానంద మృతి
బాసర(ఆదిలాబాద్) : ముథోల్ మండలం బాసర గ్రామానికి చెం దిన అతా రజితా సా దన ఆశ్రమ వ్యవస్థాప కుడు స్వామి శారదా నంద ఉరఫ్ వనం సత్యనారాయుణరావు (75) వడదెబ్బతో ఆ దివారం చనిపోయూరు. వారం రోజులుగా తన పనుల నిమిత్తం ఎండలో తిరగడంతో అస్వస్థత కు గురయ్యూడు. వాంతులు, విరేచనాలు కావ డంతో వైద్యులను ఆశ్రరుుంచాడు. పరిస్థితి విష మించడంతో ఇంట్లోనే చని పోరుునట్లు వైద్యుడు సంతోష్ తెలిపారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనం కిష్టాపురం గ్రామానికి చెందిన ఈయన  ఆరేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఆయనకు కుమారుడు, కూతురు ఉన్నారు.
 
ఇల్లెందులో ఇద్దరు...
ఇల్లెందు :   మండలంలోని రొంపేడు గ్రామపంచాయతీ క్యాంపు రొంపేడుకు చెందిన  పూనెం సుక్కమ్మ(55)  సోమవారం తునికాకు సేకరణకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాగానే వాంతులు, విరోచనాలయ్యూరుు. వైద్యం కోసం తరలించే క్రమంలోనే మృతి చెందింది. పట్టణంలోని 21వ వార్డు మంథినిఫైల్ బస్తీకి చెందిన ఎడ్ల ఐలమ్మ(63) వడ దెబ్బకు గురై మృతి చెందింది.
 
తల్లాడలో ఇద్దరు..
తల్లాడ : మండల పరిధిలోని పాత మిట్టపల్లి గ్రామానికి చెందిన కంచెపోగు వెంకటనరసమ్మ(48)  రెండు రోజుల క్రితం  వడదెబ్బకు గురైం ది.  పరిస్థితి విషమించటంతో సోమవారం మృతి చెందింది. ఆమెకు కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
రామానుజవరంలో
రామానుజవరం గ్రామంలో  శీలం వెంకట్రామమ్మ(55)కు గత మూడు రోజుల క్రితం వడదెబ్బ తగిలింది. చికిత్స పొందతూ సోమవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు, కు మార్తె ఉన్నారు.
 
జూలూరుపాడులో ఒకరు..
చినేనిపేటతండా(జూలూరుపాడు): మండలంలోని మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దతండాకు చెందిన లాకావతు లక్కి(80) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement