మెదక్ టౌన్: మెతుకుసీమపై భానుడు మరోసారి నిప్పుల వర్షం కురిపించాడు. కొన్ని రోజులుగా ఎండలు మండుతున్నప్పటికీ శుక్రవారం సూరీడు మరింత మండిపడ్డాడు. దీంతో 44 డ్రిగీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత.
మాడు పగిలే ఎండలు, ఉక్కపోత భరించలేక జనం విలవిల్లాడి పోయారు. ఉదయం 8 గంటలకే జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా శుక్రవారం పెద్ద ఎత్తున పెళ్లిళ్లు ఉండటంతో మండుతున్న ఎండ, తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.