వారం రోజులుగా ఎండల దెబ్బతో విలవిలలాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. బుధవారం రాత్రి ఉరుములు...
పడిపోయిన చెట్లు
పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం
సాక్షి, కడప : వారం రోజులుగా ఎండల దెబ్బతో విలవిలలాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వ ర్షం రావడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. పులివెందులలో దాదాపు గంట పాటు ఉరుములు, మెరుపులు బెంబేలెత్తించాయి. అర గంటపాటు వర్షం కూడా రావడంతో చల్లని వాతావరణం అలరించింది. ప్రొద్దుటూరులో గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం రావడంతో వీధుల్లో వర్షపు నీరు పారింది.
పలు చోట్ల చెట్లు కూలడంతో సమస్యలు తలెత్తాయి. రాజంపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలులు బాగా వీచడంతో ఎలాంటి ్రపమాదాలు జరగకుండా విద్యుత్‌శాఖ అధికారులు ముందస్తుగా పలు చోట్ల విద్యుత్‌ను నిలిపివేశారు. కడప నగరంతోపాటు రాయచోటి, బద్వేలు, రైల్వే కోడూరు, బద్వేల ప్రాంతాలలో చిరు జల్లులు పడ్డాయి.