మరో రెండు రోజులు వడగాడ్పులు
Published Mon, May 22 2017 5:12 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
రామగుండం: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మరో రెండు రోజులు అంటే ఈనెల 24వ తేదీ వరకు అత్యంత భయంకరమైన వేడితో కూడిన వడగాడ్పులు వీయనున్నాయని ఇండియా మెట్రోలాజికల్ విభాగం పేర్కొంది. ఈ మేరకు వాతావరణ పరిస్థితుల గురించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రాబోయే రెండు రోజులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.
Advertisement
Advertisement