తెలంగాణ భగభగ
సాక్షి, హైదరాబాద్:
ప్రచండ భానుడి ప్రతాపంతో రాష్ట్రం మండిపోతోంది. ఈ వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడి పోతున్నారు. గత నాలుగైదు రోజులుగా రోజురోజు కు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో రాష్ట్రం నిప్పు ల కుంపటిలా మారింది. గురువారం చాలా చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 46 డిగ్రీల సెల్సియస్‌ను మించి ఉష్ణోగ్రతలు నమోదు కావ టంతో నల్లగొండ, రామగుండం, భద్రాచలం తది తర ప్రాంతాలు భగభగలాడిపోయాయి. ఆదిలాబా ద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లు కూడా 45 డిగ్రీల వేడితో మండిపోయాయి. హైదరాబాద్, పరి సర ప్రాంతాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను మించి నమోదయ్యాయి. ఉద యం 10 గంటల నుంచి భానుడి ప్రతాపం తీవ్రం కావటంతో జనం బయటకు రావడానికే భయ పడుతున్నారు. ఎండకు తోడు వడగాలుల తీవ్రత కూడా అధికంగా ఉండటంతో సాయంత్రం 6 గంట ల వరకు జనం అవస్థలు పడాల్సి వచ్చింది. మరి కొద్ది రోజులు ఇదే తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు
నల్లగొండ 46.4
భద్రాచలం 46.2
రామగుండం 46.0
ఆదిలాబాద్ 45.3
ఖమ్మం 45.0
నిజామాబాద్ 43.9
మహబూబ్‌నగర్ 43.8
మెదక్ 43.4
హైదరాబాద్ 42.2