ఈ ఫోటోను చూడండి. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. అయితే ఇక్కడ మాత్రం సమ్మర్‌లో వింటర్‌ను తలపిస్తోంది కదూ. ఇదే ప్రకృతి మాయాజలం అంటే. ఒకవైపు భానుడి భగభగలకు జనం అల్లాడిపోతుంటే...మరోవైపు మండువేసవిలో దట్టమైన పొగమంచు కనువిందు చేస్తోంది. ఇక్కడ ఉన్న సిక్కోలు (శ్రీకాకుళం) సిత్రాలే ఇందుకు నిదర్శనం. శ్రీకాకుళం పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున దట్టంగా మంచు కురిసింది. అంతలో కాసేపటికే సూరీడు సుర్రుమంటూ విరుచుకుపడ్డారు. ఈ వింత పరిస్థితి చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఒక రోజు... 15 ప్రసవాలు...
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిన్న (శుక్రవారం) ఒకేరోజు రికార్డు స్థాయిలో 15 ప్రసవాలు చేశారు. వాటిలో 10 సిజేరియన్, ఐదు సాధారణ కాన్పులు ఉన్నాయి. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు నెలల నుంచి ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 3 నెలల్లో 871 కాన్పులు చేశామని, వీటిలో 102 సిజేరియన్ ఆపరేషన్లు ఉన్నాయన్నారు.