కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా సగటున ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలు పెరిగింది. మచిలీపట్నంలో 37 డిగ్రీలు నమోదు అయ్యింది.
విశాఖ : కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా సగటున ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలు పెరిగింది. ఇక కృష్ణాజిల్లా మచిలీపట్నంలో 37 డిగ్రీలు నమోదు అయ్యింది. మరో రెండ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఈ ఏడాది వర్షాలు మాత్రం అనుకున్న స్థాయిలో పడటం లేదు.
మరోవైపు సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు దాటినా వర్షపాతంలో భారీ లోటు నమోదు కావడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఇప్పటికే విత్తనాలు వేసి వరుణుడి కోసం రైతులు ఆకాశంవైపు దీనంగా చూస్తున్నారు. ఇటీవల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొద్దిమేర వర్షాలు పడినా అవి నాట్లు వేసేందుకు సరిపోవని రైతులు ఆందోళన చెందుతున్నారు.