coastal districts
-
మరికొద్దిగంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం ఏర్పడనుంది. క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేటి నుంచి మరో నాలుగు రోజులు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశ ఉంది. ఆదివారం వరకు మత్స్యకారుల హెచ్చరికలు కొనసాగనున్నాయి. ఉత్తరాంధ్ర సమీపంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది.తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. నీటిమట్టం 10.7 అడుగులకు చేరుకుంది. 8 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భారీగా నీరు బ్యారేజీ నుంచి విడుదల కావడంతో కోనసీమలో కాజ్‌వేలు నీటమునుగుతున్నాయి. గంటి పెదపూడి లంక, కనకాయ లంక కాజ్‌వేలు మీదుగా వరదనీరు ప్రవహిస్తోంది. పలు లంక గ్రామాలకు పడవలపై రాకపోకలు కొనసాగుతున్నాయి.చింతూరు ఏజెన్సీలో వరద భయం మరోసారి మొదలైంది. మూడు రోజులుగా ఏజెన్సీతో పాటు, ఎగువన కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులకు భారీగా వరదనీరు చేరుతోంది. విఆర్ పురం మండలం పరిధిలో 28 గిరిజన గ్రామాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. కొండవాగులు పొంగి ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
AP: భారీ వర్షాలు.. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో న ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది.రాష్ట్రంలో పలుచోట్ల ఆనకట్టలు దెబ్బ తింటున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు, అధికారులు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోలోనూ మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి మండలంలో 28.4 మి.మీ వర్షపాతం నమోదైంది.తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమండ్రితో పాటు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో డెల్టా కాలువలకు నాలుగు వేల క్యూసెక్కులు సరఫరా చేసి మిగిలిన నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 175 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజ్ ఇరిగేషన్ అధికారులు.లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం నెమ్మదిగా బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో 26వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాలోలతో పాటు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 27, 28 తేదీల్లో అనేక చోట్ల విస్తారంగా వానలు కురుస్తాయని వెల్లడించారు. -
అల్పపీడనంగా మారిన తుపాను
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని వణికించిన మిచాంగ్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటిన తర్వాత క్రమేపీ బలహీన పడినప్పటికీ, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో బుధవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లా తాడువాయిలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 29.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా దార్లపల్లిలో 29.5, ఏలూరు జిల్లా రేచర్లలో 26, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, 8 జిల్లాల పరిధిలో 137 మండలాల్లోని సుమారు వెయ్యి గ్రామాలపై మిచాంగ్ తుపాను ప్రభావం చూపింది. ♦ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల రైతులు వణికి పోయారు. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం వద్ద గండివాగు, ముచి్చంతాల వద్ద వాగు, అనిగండ్లపాడు వద్ద దూళ్లవాగు, కూచివాగు పొంగటంతో వరి పైరు నీట మునిగింది. పూత, పిందె దశలో ఉన్న మిర్చి పంట నేలకు వంగిపోయింది. గంపలగూడెం మండలంలో కట్టెలేరులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ♦ అనకాపల్లి జిల్లాలో బుధవారం కూడా వర్షాలు పడ్డాయి. అధికారుల ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. అనకాపల్లి జిల్లా పెద్దేరు జలాశయంలోకి 4 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అంతే వరద నీరు 3 ప్రధాన గేట్ల ద్వారా పెద్దేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించిందని.. వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి తెలిపారు. విద్యుత్ శాఖకు రూ.21 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. నాలుగు జెర్సీ ఆవులు చనిపోయాయని, 25 ఇళ్లు, 86 పూరిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరితోపాటు రాజ్మా, కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది. చింతూరు డివిజన్లో పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. ప్రధాన గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పరదానిపుట్టు కాజ్వే అవతల ఉన్న పెదబయలు, పాడేరు మండలాల్లోని 150 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. పెదబయలు మండలం పరదానిపుట్టుకు చెందిన కిల్లో రామకృష్ణ (40) మత్స్యగెడ్డలో చేపలు వేటాడుతూ జారి పడి కొట్టుకుపోయి మృతిచెందాడు. ♦ కాకినాడ జిల్లాలో ఈదురు గాలులు, భారీ వర్షాలతో పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మేడపాడులో పూరిపాక కూలిపోయి ముక్కుర్తి నాగరాజు(62) మృతిచెందాడు. చేబ్రోలులో చెరువుకు గండిపడింది. కొత్తపల్లి కొండవరంలో సుడిగాలితో సుమారు 50 ఇంటి పైకప్పులు ఎగిరిపోగా, మరికొన్ని ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. సుడిగాలికి దెబ్బతిన్న పిఠాపురం మండలం పి.దొంతమూరు, కొత్తపల్లి మండలం కొండెవరంలలో 100 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. జగ్గంపేట నియోజకవర్గంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ♦ అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల కాలనీలు ముంపునకు గురయ్యాయి. ♦ తిరుపతి జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాళంగి నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చింది. రిజర్వాయర్లన్నీ నిండిపోవటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి వచ్చే వరద నీటితో జాతీయ రహదారిపై 5, 6 అడుగుల ఎత్తున నీరు ప్రవహించింది. గూడూరు డివిజన్లో ఇప్పటికీ కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. -
ఏపీకి తుపాను ముప్పు.. రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్రవాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డా. అంబేద్కర్ వెల్లడించారు. చదవండి: మనసున్న మారాజు సీఎం వైఎస్ జగన్ -
బంగాళాఖాతంలో వాయుగుండం! తుపానుగా బలపడే అవకాశం?
సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. వాయుగుండంగా మారిన తర్వాత దిశ గమనం బట్టి ఏపీపై కురిసే వర్షాలపై అంచనా. ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ వాయుగుండం తుపానుగా బలపడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. నేడో, రేపో మన రాష్ట్రంలోనూ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. చదవండి: దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు -
Rain Alert: కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం దాని అనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఆవరించి ఉంది. రేపు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఏపీ తీరం వెంబడి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. చదవండి: ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల రాగల మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
అలర్ట్: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: కోస్తా జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రాజోలు మండలం తాటిపాకలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఏలూరు జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో వర్షం పడింది. నెల్లూరు నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. చదవండి: బాబూ.. మేనిఫెస్టో అమలుపై చర్చకు రా.. మంత్రి కారుమూరి సవాల్ -
వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలు!
సాక్షి, అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశాను ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా చత్తీస్‌గఢ్ వైపు పయనించి 24 గంటల్లో నెమ్మదిగా బలహీనపడుతూ భూమి మీదకు ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 6.9 సెం.మీ వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మడుగుల మండలం కుంతలంలో 6.6, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 5.5, పలాసలో 5.2, కాకినాడ జిల్లా తాళ్లరేవులో 5.1 సెం.మీ వర్షం కురిసింది. బుధవారం నుంచి వర్షాలు అక్కడక్కడా తప్ప చాలా ప్రాంతాల్లో తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
అభివృద్ధికి రహదారి.. చెన్నై, కోల్‌కతా మధ్య మరింత వేగంగా ప్రయాణం
సాక్షి, కృష్ణాజిల్లా: కోస్తా తీరం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచేందుకు చేపట్టిన 216 నంబరు జాతీయ రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తీరప్రాంతం పారిశ్రామిక, వర్తక, వాణిజ్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల అభివృద్ధికి చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది. టీడీపీ పాలకుల కమీషన్ల కక్కుర్తి కారణంగా పనుల్లో జాప్యం నెలకొంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే మచిలీపట్నం పోర్టు ద్వారా చెన్నై, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు రవాణా మార్గం సులభతరం అవుతుంది. బందరు పోర్టు అనుబంధ పరిశ్రమలకు రోడ్డు రవాణా మార్గం అందుబాటులోకి వస్తుంది. బాపట్ల, రేపల్లెతో పాటు కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి ఏటా రూ.1150 కోట్ల ఎగుమతులు సాధిస్తున్న ఆక్వా రంగం మరింతగా పుంజుకుంటుంది. తగ్గనున్న 150 కి.మీ. దూరం తమ ప్రాంతం అభివృద్ధి కోసం జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టాలంటూ 2002లో కృష్ణా జిల్లా లోని పలు మండలాలకు చెందిన మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. నెలల తరబడి దీక్షలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ ఉద్యమ ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం 216 జాతీయ రహదారిని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే చెన్నై – కోల్‌కతా మధ్య 150 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కోల్‌కతా, చెన్నై మధ్య రాకపోకలు సాగించే వాహనాలు ఏలూరు, విజయవాడ, గుంటూరు వెళ్లకుండానే నేరుగా ఒంగోలు చేరుకుంటాయి. ఫలితంగా ఇంధనం, సమయం ఆదా అవుతాయి. కోస్తా తీర ప్రగతికి రాచమార్గం 216 జాతీయ రహదారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను మండలం పల్లెపాలెం నుంచి పులిగడ్డ వరకు 120 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఈ రహదారిని నాలుగు వరసలుగా విస్తరిస్తున్నారు. 16 నంబరు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా ఒంగోలు నుంచి 216వ నంబరు జాతీయ రహదారి ప్రారంభమవుతుంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ కత్తిపూడి వద్ద తిరిగి 16 నంబరు జాతీయ రహదారిలో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 260.5 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 30, కృష్ణాలో 138, గుంటూరులో 48, ప్రకాశంలో 123.48 హెక్టార్ల భూములు సేకరించారు. ఇందు కోసం నిర్వాసితులకు రూ.320 కోట్లు చెల్లించారు. పొడవైన వంతెనలు.. పెద్ద ఎత్తున కల్వర్టులు ప్రాజెక్టులో భాగంగా రైల్వే క్రాసింగ్ ఉన్న చోట్ల ఆరు ప్రాంతాల్లో రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లు నిర్మిస్తున్నారు. పిఠాపురం, సామర్లకోట, రావులపాలెం, పెడన, భట్టిప్రోలు, చినగంజాం వద్ద ఆర్వోబీలు నిర్మిస్తున్నారు. కాకినాడ వద్ద 19 కిలోమీటర్ల పొడవున బైపాస్ నిర్మించారు. గతంలో ఉన్న వంతెనల స్థానంలో 164 కొత్త వంతెనలను నిర్మిస్తున్నారు. ఈపూరుపాలెం – ఒంగోలు మధ్య 25, కత్తిపూడి – కాకినాడ మధ్య 23 వంతెనలు నిర్మిస్తున్నారు. 731 కల్వర్టులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలో పెడన వద్ద ఇప్పటికే బైపాస్ ఉండగా, బంటుమిల్లి సమీపంలో మరో బైపాస్ నిర్మిస్తున్నారు. చల్లపల్లి, మోపిదేవి, మచిలీపట్నం వద్ద బైపాస్‌లు నిర్మిస్తున్నారు. ఏడు టోల్ ప్లాజాలు ఈ రహదారిపై ఏడు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేస్తారని సమాచారం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, అన్నంపల్లి, పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం, కృష్ణా జిల్లా బాసినపాడు, మోపిదేవి, గుంటూరు జిల్లా రెడ్డిపాలెం, ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద టోల్‌ప్లాజాలు ఏర్పాటవు తాయని తెలుస్తోంది. ఈ జాతీయ రహదారిపై సాధారణ వేగం 80, గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఈ రహదారిని ఒకే దిశలో మలుపులు లేకుండా డిజైన్ చేశారు. వంతెనల వద్ద అప్రోచ్‌రోడ్ల నిర్మాణం పనులు సాగుతున్నాయి. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఈ రహదారిని మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మోపిదేవి మండలం పెదప్రోలు వద్ద నిర్మాణంలో ఉన్న 216 జాతీయ రహదారి పెడన వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ -
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కోస్తా జిల్లాలు తడిసిముద్దయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో వరద ఉధృతికి, పిడుగుపాటుకు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో ఇద్దరు గల్లంతవ్వగా, మరో ఇద్దరు మృతి చెందారు. కుండపోతగా కురిసిన వానలకు కొండ వాగులు, వంకలు, నదులు ఉధృతరూపం దాల్చాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాక్షి, నెట్వర్క్: కృష్ణా జిల్లాలో సోమవారం 1.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు మెట్ట, డెల్టా, ఏజెన్సీ ప్రాంతాలు జలమయమయ్యాయి. మన్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగులు రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని చుట్టుముట్టాయి. ఎటపాకలో మిర్చి తోటలు నీట మునిగాయి. కాకినాడలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రిలోకి వర్షపు నీరు భారీగా చేరడంతో అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోట్‌క్లబ్ కాంపౌండ్ వాల్ కూలిపోయింది. జిల్లాలో సగటు 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ శ్రీకేష్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తోటపల్లి, మడ్డువలస జలాశయాలకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. విజయనగరం జిల్లాలో చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. చంపావతి, సువర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తోటపల్లి, వట్టిగెడ్డ, తాటిపూడి జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తడిసి ముద్దయింది. ఏజెన్సీలో కొండవాగులు పొంగి పొర్లాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుండేటి వాగు పొంగి ప్రవహించడంతో 10 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లింగపాలెం మండలం యడవల్లిలో భారీ వర్షానికి ఇంటి గోడ కూలి గొడ్డేటి నాగేశ్ (55) మృతి చెందాడు. యువతి గల్లంతు బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనానికి వెళ్లిన మనీషా వర్మ (23) అనే యువతి కొండవాగుల ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరుడు, మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. రాగల రెండు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడుతుందని తెలిపారు. ఇక గురువారం మోస్తరు వర్షం పడుతుందన్నారు. కాగా, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సగటున 6.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో ఉధృతంగా వరాహ, శారదా నదులు విశాఖ ఏజెన్సీలో గెడ్డలు, కొండవాగులు, వరాహ, శారద నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనంతగిరి మండలం పైడపర్తికి చెందిన పాడి కన్నయ్య (41) వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అలాగే మాడుగుల మండలం గొప్పులపాలెంకు చెందిన పాగి నాగమణి (28) పిడుగుపాటుతో మృతి చెందింది. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో ఛత్తీస్‌గఢ్ తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆనుకుని ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. రాగల 24 గంటల్లో దిశను మార్చుకుని ఉత్తర దిశగా విదర్భ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉంది. మరోవైపు.. అల్పపీడన ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు పడతాయని వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ వరకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయన్నారు. మత్స్యకారులెవ్వరూ రాగల 48 గంటల వరకూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ముసునూరులో 58.5 మి.మీ, సూళ్లూరుపేటలో 55.2, చింతూరులో 52, లావేరులో 45.2, నర్సాపురంలో 40, పెడనలో 39, పాలకొండలో 34.5, రాయవరంలో 30.5, అనపర్తిలో 28.5, సీతంపేట 27.5 మి.మీ వర్షపాతం నమోదైంది. -
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రస్తుతం మధ్యప్రదేశ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించిన అల్పపీడనం.. మరింత తీవ్రరూపం దాల్చిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది ఇప్పటికీ సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి గుజరాత్ దిశగా కదులుతోందని వివరించింది. బుధవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. వాయగుండం ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలపై రుతుపవనాలు బలంగా కనిపిస్తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. విశాఖపట్టణం మీదుగా రుతుపవన ద్రోణి పయనిస్తోందన్నారు. రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోందని చెప్పారు. సెప్టెంబరు 2న కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని వెల్లడించారు. -
త్వరలో కలెక్టర్ల బదిలీలు!
- ‘ఎస్ సార్’ అనేవారికే పోస్టింగులు - మాటవినని వారికి అప్రధాన పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. అధికార పక్షం నేతలు చెప్పిన అడ్డగోలు పనులు చేసేందుకు వీలుకాదంటున్న వారిని తప్పించేందుకు కసరత్తు సాగుతోంది. తాము ఏమి చెప్పినా ‘ఎస్ సార్’ అనే వారిని జిల్లా మెజిస్ట్రేట్లుగా తెచ్చుకోవాలని కొందరు మంత్రులు, అధికార పక్ష ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. చెప్పిన మాట చెప్పినట్లు చేయకుండా నిబంధనలు అంగీకరించవని చెప్పే వారిని తప్పించి అప్రధాన పోస్టులకు పంపించాలని మంత్రులు ఒత్తిడి తెస్తున్నారు. తాము చెప్పినట్లు చేయలేదనే కక్షతో కలెక్టర్లను తప్పించేందుకు తప్పుడు ఫిర్యాదులు కూడా చేయిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో కూడా ఇద్దరు కలెక్టర్లపై ఇలాగే బురదచల్లి బదిలీ చేయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ‘టీడీపీ వారు చెప్పిన పనులు చేయాల్సిందే. అధికారంలోకి తెచ్చిన వారికి మేలు చేయడం కుదరదంటే ఎలా? రూల్స్ మాట్లాడవద్దు... మావారు (అధికార పక్షం నేతలు) చేసిన సిఫార్సుల అమలు చేయండి. ఈ విషయంలో ఇక నాకు ఫిర్యాదులు రాకూడదు..’ అని కీలక నేత కొంతకాలం కిందట నేరుగా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మీరు చెప్పిన తర్వాత కూడా మాట వినడంలేదు. వారిని మార్చండని తాజాగా కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన బదిలీపైనే ప్రధాన చర్చ... గతంలో ఐఏఎస్‌ల బదిలీల సందర్భంగా రాయలసీమలో ఒక జిల్లా కలెక్టర్ కచ్చితంగా బదిలీ అవుతారని ఆ జిల్లా ఉద్యోగులు, అధికారులు దృఢంగా విశ్వసించారు. ‘కలెక్టరు వేధింపులు భరించలేకపోతున్నాం. జిల్లా స్థాయి అధికారులను సైతం నిత్యం వేధిస్తున్నారు. భారీ అవినీతికి పాల్పడుతున్నారు. ఆయన దోచుకుంటూ మాపై అవినీతి ముద్ర వేస్తున్నారు...’ అంటూ సదరు అధికారి అక్రమార్జనపై వివరాలతో ప్రభుత్వానికి ఆకాశరామన్న ఉత్తరాలు కూడా పంపించారు. కొందరు అధికార పక్ష ప్రజాప్రతినిధులు కూడా ఆయనను బదిలీ చేయాలని కోరారు. కలెక్టరు బదిలీ అయితే పొట్టేళ్లు బలి ఇస్తామని, కొబ్బరికాయలు కొడతామని చాలామంది అధికారులు మొక్కుకున్నట్లు అధికారవర్గాల్లో రసవత్తరమైన చర్చ సాగింది. ఆ జిల్లా కలెక్టర్ కచ్చితంగా బదిలీ అవుతారని సచివాలయంలోనూ ప్రచారం సాగింది. అయితే సదరు కలెక్టర్ బదిలీ కాలేదు. ఈ పర్యాయం ఆయన బదిలీ తప్పకపోవచ్చని అధికాారులు చెబుతున్నారు కానీ... ‘ఆ కలెక్టర్ బదిలీ కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఎవరి మాటా వినని విషయం వాస్తవమే. అయితే సీఎం కాలితో చెబితే చేతితో చేస్తారు. అందువల్లే సీఎం ఆయనను బదిలీ చేయకపోవచ్చు’ అని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పనిచేసి ఉత్తరాంధ్ర జిల్లాకు కలెక్టరుగా వెళ్లిన ఓ అధికారికి ముక్కుసూటి మనిషనే గుర్తింపు ఉంది. అన్నివిధాలా అవినీతికి పాకులాడే ఆ జిల్లా మంత్రికి ఆ కలెక్టర్ నచ్చడంలేదు. కలెక్టరును మార్చితేనే కార్పొరేషన్ ఎన్నికల్లో నెగ్గుకు రాగలమని అధికారపార్టీ నేతల ద్వారా కూడా మంత్రి సీఎంకు చెప్పిస్తున్నారని సమాచారం. రాయలసీమలో కరువుతో పంటలు ఎండిపోవడాన్ని సకాలంలో తన దృష్టికి తీసుకురాలేదనే తప్పుడు ఆరోపణలతో మరో కలెక్టర్‌ను మార్చాలని ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. అసలు విషయం ఏంటంటే పాలకపక్ష నాయకులు అడ్డగోలుగా కాంట్రాక్టులు అడుగుతుండంతో ఆ కలెక్టర్ అంగీకరించడంలేదనేది సమాచారం. కోస్తాలో ఇటీవలే పోస్టింగు లభించిన మరో కలెక్టర్‌ను కూడా మార్చాలని నాయకులు కోరుతున్నారని తెలిసింది. మున్సిపల్ ఎన్నికల తోనూ లింకు... త్వరలో జరగనున్న నగరపాలక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలంటే ఫలానా అధికారులను బదిలీ చేయాలని ఇటీవల కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి విన్నవించారు. రకరకాల సాకులతో ఇప్పటివరకూ ఎన్నికలు జరపకుండా తప్పించుకుంటూ వచ్చిన సర్కారు హైకోర్టు ఆదేశాల మేరకు ఈఏడాది చివర్లో ఎన్నికలు జరపక తప్పదని నిర్ణయించుకుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, కర్నూలు, తిరుపతి, కాకినాడ, గుంటూరు, ఒంగోలు నగర పాలక సంస్థలు, రాజంపేట, రాజాం, కందుకూరు, నెల్లిమర్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాల్సి ఉంది. ఈ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని, ఇందుకు కావాల్సిన సాధనాసంపత్తులన్నీ తానే సమకూర్చుతానని ఆయా జిల్లాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వీటిలో గెలవాలంటే మాట వినని కలెక్టర్లను బదిలీచేసి అనుకూలమైన వారిని వేయాలని మూడు జిల్లాల నేతలు కోరారు. త్వరలోనే కలెక్టర్లను బదిలీ చేస్తామని, మన మాట వినే వారే వస్తారని ముఖ్యమంత్రి చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో త్వరలో కలెక్టర్ల బదిలీలు ఉంటాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. -
తమిళ తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు
చెన్నై : తమిళనాడు తీర ప్రాంత జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాల్లోని జన జీవనం అస్తవ్యస్థం అయింది. చెన్నై మహానగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. దీంతో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ జనసంద్రంగా మారింది. -
తీరప్రాంతాల్లో హుదూద్ విధ్వంసం; నలుగురు మృతి
విశాఖపట్నం/భువనేశ్వర్: హుదూద్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. భారీ వర్షాలు, భీకర గాలులతో అతలాకుతలం చేసింది. దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో ప్రపంచ గాలులు వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా సంభవించిన విధ్వంసానికి నలుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండున్న లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో లక్ష మందిని పునరావాస కేంద్రాలకు పంపారు. ఇంకా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా విశాఖ నగరంపై పడింది. ప్రపంచ పవనాల ధాటికి చెట్లు, విద్యుత్ సంభాలు కూలిపోయాయి. ముందుజాగ్రత్తగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థను నిలిపివేశారు. తుఫాన్ కారణంగా ఇప్పటివరకు 70 ఇళ్లు దెబ్బతిన్నాయని, 34 జంతువులు మృతి చెందాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు, ఒడిశాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. -
కోస్తా జిల్లాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
విశాఖ : కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా సగటున ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలు పెరిగింది. ఇక కృష్ణాజిల్లా మచిలీపట్నంలో 37 డిగ్రీలు నమోదు అయ్యింది. మరో రెండ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఈ ఏడాది వర్షాలు మాత్రం అనుకున్న స్థాయిలో పడటం లేదు. మరోవైపు సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు దాటినా వర్షపాతంలో భారీ లోటు నమోదు కావడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఇప్పటికే విత్తనాలు వేసి వరుణుడి కోసం రైతులు ఆకాశంవైపు దీనంగా చూస్తున్నారు. ఇటీవల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొద్దిమేర వర్షాలు పడినా అవి నాట్లు వేసేందుకు సరిపోవని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
వాయువ్య బంగాళఖాతంలో బలపడనున్న అల్పపీడనం!
వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాతో సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. -
తీరం దాటిన లెహర్
-
జిల్లావ్యప్తంగా 400 కోట్ల రూపాయల పంటనష్టం
-
శ్రీకాకుళం జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు
శ్రీకాకుళం: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం కూడా పాఠశాలకు సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని నదులు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే అప్రమత్తమయిన అధికారులు 72 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 45వేల మంది వరకూ ఆశ్రయం పొందుతున్నారు. నేవీ, ఎన్ఆర్పీఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యాయి. బహుదా నదిలో 83క్యూసెక్కుల నీరు , వంశధారలో 70వేల క్యూసెక్కులు, నాగావళి నదిలో 36వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో పరిసర గ్రామాలన్నీ నీటి బారిన పడ్డాయి. బహుదా నది పరివాహక ప్రాంతంలో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను, వంశధార నదికి రెండో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. -
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం
ఈశాన్య రుతుపవనాల ప్రభావం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రభావం కలగలిసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సహా తీరప్రాంత జిల్లాలు, తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్‌లో గోడలు కూలిన సంఘటనలు రెండు చోట్ల చోటుచేసుకున్నాయి. ట్రాఫిక్‌కు పలుచోట్ల అంతరాయం కలుగుతోంది. వనస్థలిపురం ఆటోనగర్ ప్రాంతంలో గోడకూలి ఇద్దరికి గాయాలయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు అన్ని మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరిపంట చేతికి అందివస్తున్న తరుణంలో కురిసిన వర్షాల వల్ల రైతన్న నిండా మునిగిపోయాడు. ప్రకాశం జిల్లాలో బుధవారం ఒక్కరోజే ఏకంగా 34 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక గుంటూరు జిల్లా బాపట్ల మండలం గిల్లెలమోడిలో నల్లమల డ్రైన్‌కు గండి పడి, గ్రామంలోకి భారీగా వరదనీరు వచ్చింది. దీంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 22 పునారావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,500మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నరసరావుపేటలో ఒక బస్సు వాగులో చిక్కుకుపోయింది. బస్సు దాదాపు పైభాగం వరకు కూడా నీళ్లు రావడంతో అందులోని కొందరు ప్రయాణికులు బస్సు టాప్ మీదకు ఎక్కి నిలబడ్డారు. ఎట్టకేలకు అధికారులు వారిని రక్షించగలిగారు. నల్లగొండ జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. గోనగోయినపల్లిలోని డిండివాగు పొంగి ప్రవహిస్తోంది. వాగులో నలుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. తమను రక్షించాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా వర్షం భారీగా కురవడంతో పలుచోట్ల మార్కెట్ యార్డుల్లోకి నీళ్లు చేరుకున్నాయి. యార్డుల్లో నిల్వచేసిన ధాన్యం, మిర్చి, పత్తి పంటలు నీట మునిగాయి. -
కోస్తా జిల్లాలలో భారీ వర్షం
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురిచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నెల్లూరు తీరంలో అల్పపీడనం ఏర్పడిందని, రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం వాతావరణ కేంద్రం తెలిపింది. మాడుగుల మండలం పెద్దేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. 2 గేట్లు ఎత్తివేసి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తూర్పు గోదావరి, శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు కాకినాడలో మెయిన్ రోడ్డుతో పాటు పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోనసీమలోని ఆత్రేయపురం, కొత్తపేట, తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు మండలాల్లో పాలుపోసుకుని గింజ గట్టిపడే దశలో ఉన్న వరి చేలు నేలకొరిగాయి. అయితే ప్రస్తుత వర్షాల వల్ల పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా, నెల్లూరు నగరంలో కుండపోతగా వాన కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ అప్సర సర్కిల్, ఎన్జీవో కాలనీలు నీట మునిగాయి.