వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాతో సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది.