తమిళనాడు తీర ప్రాంత జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి.
చెన్నై : తమిళనాడు తీర ప్రాంత జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాల్లోని జన జీవనం అస్తవ్యస్థం అయింది. చెన్నై మహానగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. దీంతో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ జనసంద్రంగా మారింది.