శ్రీకాకుళం: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం కూడా పాఠశాలకు సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని నదులు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే అప్రమత్తమయిన అధికారులు 72 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 45వేల మంది వరకూ ఆశ్రయం పొందుతున్నారు. నేవీ, ఎన్‌ఆర్‌పీఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యాయి.
బహుదా నదిలో 83క్యూసెక్కుల నీరు , వంశధారలో 70వేల క్యూసెక్కులు, నాగావళి నదిలో 36వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో పరిసర గ్రామాలన్నీ నీటి బారిన పడ్డాయి. బహుదా నది పరివాహక ప్రాంతంలో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను, వంశధార నదికి రెండో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.