
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రస్తుతం మధ్యప్రదేశ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించిన అల్పపీడనం.. మరింత తీవ్రరూపం దాల్చిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది ఇప్పటికీ సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి గుజరాత్ దిశగా కదులుతోందని వివరించింది. బుధవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
వాయగుండం ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలపై రుతుపవనాలు బలంగా కనిపిస్తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. విశాఖపట్టణం మీదుగా రుతుపవన ద్రోణి పయనిస్తోందన్నారు. రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోందని చెప్పారు. సెప్టెంబరు 2న కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని వెల్లడించారు.