భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఎండల తీవ్రత, వడగాడ్పులతో జనం విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు గురై పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 171 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారని విపత్తు నిర్వహణ శాఖ శనివారం ప్రకటించింది.