సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భగ భగ మండే ఎండల నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పోందుతున్నారు. తాజాగా విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది.
దాదాపు రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో నగర వాసులకు ఊరట లభించింది. భారీ వర్షం నేపథ్యంలో నగరంలోని పలు రోడ్లు జలమయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా బిపర్ జోయ్ తుపాను కారణంగా విస్తరణ ఆలస్యం కావడంతో రైతులు, సాధారణ ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో..
తెలంగాణలో వేడిగాలులు, ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌లో వర్షం కురవగా.. హైదరాబాద్‌లో ఎండలు కాస్తున్నాయి.
చదవండి: 5 తరాలు, 85 మంది కుటుంబ సభ్యులు.. 102 ఏళ్ల బామ్మకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment