
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (నేడు)14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 102 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
ఆ.. మండలాలివే..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ, అడ్డతీగల, అనకాపల్లి జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కాకినాడ జిల్లాలో కోటనంమూరు, పల్నాడు జిల్లాలో అమరావతి, పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపు కోట మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 16, నంద్యాలలో 12, అనకాపల్లిలో 11, పల్నాడులో 11, వైఎస్సార్‌లో 11, పార్వతీపురం మన్యంలో 9, విజయనగరంలో 8 మండలాలతో పాటు మిగిలిన చోట్ల మొత్తం 102 మండలాల్లో వడ గాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment