
మరో 48 గంటలపాటు తీవ్ర వడగాలులు
విశాఖపట్నం: ఏపీ, తెలంగాణల్లో మరో 48 గంటలపాటు తీవ్ర వడగాలులు ఉంటాయని వాతావరణ శాఖ ఆదివారం విశాఖపట్నంలో వెల్లడించింది. ఛత్తీస్గఢ్పై ఆవర్తనం తొలగిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సాధరాణం కంటే 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగవచ్చని పేర్కొంది. వడగాలుల వల్ల ఇరు రాష్ట్రాలలో ఇప్పటి వరకు దాదాపు 500 మంది మరణించిన సంగతి తెలిసిందే.