తగ్గుతున్న ఉష్ణతాపం | Expanding Southwest Monsoon | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న ఉష్ణతాపం

Published Thu, May 28 2020 4:52 AM | Last Updated on Thu, May 28 2020 4:52 AM

Expanding Southwest Monsoon - Sakshi

సాక్షి,విశాఖపట్నం: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత ఒకట్రెండు రోజులున్నా.. ఎండలు మాత్రం అంతగా ఉండవని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ నుంచి తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటమే దీనికి కారణమంటున్నారు.

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం గురు, శుక్రవారాల్లో ఒకట్రెండు చోట్ల 40 నుంచి 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయన్నదానిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement