ఢిల్లీలో రికార్డ్‌ టెంపరేచర్ సెన్సార్‌ తప్పిదమే: ఐఎండీ | IMD says Record 52.9 degrees Celsius in Delhi Mungeshpur was error in sensor | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో రికార్డ్‌ టెంపరేచర్ సెన్సార్‌ తప్పిదమే: ఐఎండీ

Published Thu, May 30 2024 11:18 AM | Last Updated on Thu, May 30 2024 11:19 AM

IMD says Record 52.9 degrees Celsius in Delhi Mungeshpur was error in sensor

న్యూఢిల్లీ: ఢిల్లీ సమీపంలోని ముంగేశ్‌పూర్‌లో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఆ వార్తలుపై తాజాగా ఐఎండీ స్పందించింది. బుధవారం మధ్యాహ్నం 2.30 సమయంలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు  వచ్చిన  వార్తల్లో  వాస్తవం లేదని పేర్కొంది. కేవలం సెన్సార్‌ తప్పదం వల్లనే అత్యధికంగా ఉష్ణోగత్ర నమోదైట్లు ఐఎండీ తెలిపింది. డేటా తప్పుగా చూపించిన సెన్సార్‌ లోపాలపైన పరిశీలన చేస్తున్నామని ఐఎండీ తెలిపింది.

 

52.9 డిగ్రీలన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజజు నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే.  ‘‘ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత నమోదైందంటే నమ్మశక్యంగా లేదు. వాస్తవమేమిటో తెలుసుకోవాలని ఐఎండీ అధికారులకు సూచించాం. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది’’ అంటూ ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

దాంతో నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.మహాపాత్ర తెలిపారు. ‘‘డేటాలో తప్పులు దొర్లి ఉండొచ్చు. అంతటి ఉష్ణోగ్రత నిజమే అయితే స్థానిక పరిస్థితులేవైనా కారణమై ఉండొచ్చు అని అన్నారు.  ఇక.. ముంగేశ్‌పూర్‌ వాతావరణ కేంద్ర సెన్సర్లను స్పెషలిస్టుల బృందం నిశితంగా అధ్యయనం చేస్తోంది’’ అని వివరించారు. 

బుధవారం రాజస్తాన్‌లోని ఫలోదీలో 51 డిగ్రీలు, పరిసర ప్రాంతాల్లో 50.8 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో 49.1 డిగ్రీలు, పుసాలో 49, నరేలాలో 48.4 డిగ్రీలు నమోదైంది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో ప్రాంతంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement