న్యూ ఢిల్లీ : దేశ రాజధానిలో ఢిల్లీలో వాతావారణం ఒక్కసారిగా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఢిల్లీ మున్సిపల్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
రాబోయే కొద్ది గంటల్లో నగరంలోని ప్రీత్ విహార్, ఐటీవో, అక్షరధామ్‌తో పాటు ప్రదేశాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు, ఒక మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. ప్రస్తుతం, మధ్య, దక్షిణ, ఉత్తర ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
భారత వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడుతుందని అంచనా. కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తేమ స్థాయి 85 శాతంగా నమోదైందని ఐఎండీ తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విభాగంలో 59 రీడింగ్‌తో సంతృప్తికరమైన కేటగిరీలో కొనసాగింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( ఏఐక్యూ)
సున్నా 50 మధ్య ఉన్న ఏఐక్యూ ఉంటే మంచిది. 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరమైనది. 101 నుంచి 200 మధ్య ఉంటే ఫర్వాలేదని , 201 మధ్య 300 తక్కువ ప్రమాదం అని, 301 నుంచి 400 మధ్య ఉంటే మరింత ప్రమాదమని, 401 నుంచి 500 మధ్య ఉంటే మరింత తీవ్రమైనదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment