ఢిల్లీలో పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో లుటియన్స్ ఢిల్లీ,కాశ్మీర్ గేట్, ఓల్డ్ రాజేంద్రనగర్‌తో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. వచ్చే 2 గంటల్లో ఢిల్లీలో 3 నుంచి 5 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తెలిపారు. సాధారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కోచింగ్ సెంటర్‌లతో సహా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించాలని సూచించారు.
అంతకు ముందు, ఉత్తర ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లోని ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment