న్యూఢిల్లీ: దేశంలో సాధారణ వర్షపాతం నమోదుకానుందని భారత వాతావరణశాఖ మంగళవారం ప్రకటించింది. జూన్- సెప్టెంబర్ మాసంలో సాధారణ వర్షాలు కురియనున్నాయని ప్రభుత్వ వాతావరణ కార్యాలయం చెప్పింది. జూన్ టు సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాలు సీజన్ లో భారతదేశం అంతటా సాధారణ వర్షాలు కురుస్తాయని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కె.జే.రమేష్ చెప్పారు. వర్షపాతం దీర్ఘ కాలంలో సగటు 96శాతంగా ఉంటుందన్నారు. సాధారణ వర్షపాతం దేశ ఆర్థికవ్యవస్థకు, వ్యవసాయ రంగానికి మేలు చేస్తుందన్నారు. ఇది రైతులకు మరింత మేలు చేస్తుందన్నారు.
రైతులు ఈ ఏడాది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 38 శాతం అధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, మే చివరిలో నైరుతి రుతుపవననాలు కేరళను తాకే అవకాశం ఉందని చెప్పారు. వాణిజ్య పంటల కన్నా సంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.
గత ఏడాదిలో లాగే ఈ ఏడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలపై నైరుతి, ఈశాన్య రుతు పనవాల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం తగ్గుముఖం పడుతుందని ఆయన వివరించారు.
Monsoon, normal, 2017,IMD, సాధారణ వర్షపాతం, వాతావరణ శాఖ,
దేశంలో సాధారణ వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలో సాధారణ వర్షపాతం నమోదుకానుందని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. జూన్- సెప్టెంబర్‌మాసంలో సాధారణ వర్షాలు కురియనున్నాయని ప్రభుత్వ వాతావరణ కార్యాలయం చెప్పింది. జూన్ టు సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాలు సీజన్ లో భారతదేశం అంతటా సాధారణ వర్షాలు కురుస్తాయని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కె.జే.రమేష్ చెప్పారు. సాధారణ వర్షపాతం దేశ ఆర్థికవ్యవస్థకు, వ్యవసాయ రంగానికి మేలు చేస్తుందన్నారు. ఇది రైతులకు మరింత మేలు చేస్తుందన్నారు.
రైతులు ఈ ఏడాది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 38 శాతం అధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, మే చివరిలో నైరుతి రుతుపవననాలు కేరళను తాకే అవకాశం ఉందని చెప్పారు. వాణిజ్య పంటల కన్నా సంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. గత ఏడాదిలో లాగే ఈ ఏడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలపై నైరుతి, ఈశాన్య రుతు పనవాల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం తగ్గుముఖం పడుతుందని ఆయన వివరించారు.
దేశంలో సాధారణ వర్షపాతం-వాతావరణ శాఖ
Published Tue, Apr 18 2017 8:28 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
Advertisement