Cyclone Yaas: Deep Depression Intensifies Into Cyclonic Storm - Sakshi
Sakshi News home page

అతి తీవ్ర తుపానుగా మారనున్న 'యాస్‌' తుపాను

Published Mon, May 24 2021 3:51 PM | Last Updated on Mon, May 24 2021 5:30 PM

IMD Report On Cyclone Yass - Sakshi

న్యూఢిల్లీ :  తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది.  'యాస్‌' తుపాను మరో 12 గంటల్లో బలపడి తీవ్ర తుపానుగా.. 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో 620 కి.మీ దూరంలో.. పోర్ట్‌బ్లేయర్‌కు వాయవ్య దిశలోనూ.. 530 కి.మీ ఒడిశాలోని పారదీప్‌కు అగ్నేయ దిశలో.. 620 కి.మీ వాయవ్య దిశలో బెంగాల్‌ వైపు కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయవ్య దిశగా తుపాన్‌ పయనిస్తోంది. 26న ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటనుంది. గంటకు 155 కి.మీ నుంచి 185 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. తీరం దాటిన తర్వాత రాంచీ వైపుగా తుపాను పయనించనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గంటకు 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

శ్రీకాకుళం జిల్లాకు తుపాను హెచ్చరికలు
సాక్షి, శ్రీకాకుళం : 'యాస్‌' తుపాను ప్రభావం నేపథ్యంలో కలెక్టర్ తుపాను హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం నుంచి తీరం వెంబడి..గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఆయన తెలిపారు. ఆక్సిజన్‌ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా చూడాలని, రైతులు పంటలను కోత కోసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరా.. విద్యుత్ పునరుద్ధరణ, వైద్య శిబిరాల ఏర్పాటుపై సిద్ధంగా ఉండాలన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement