
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బుధవారం(మే8) కూడా భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురవచ్చని పేర్కొంది.
పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్. నాగర్ కర్నూల్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని తెలిపింది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
కాగా రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షం ప్రభావంతో జిల్లాల్లో పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడగా హైదరాబాద్ నగరంలో తీ వ్ర ట్రాఫిక్‌జామ్‌లతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు.
Comments
Please login to add a commentAdd a comment