ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మే నెల రాకతో ఎండలు మరింత ముదరడంతో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఈ తరుణంలో తూర్పు ప్రాంతంలో ఉరుములతో కూడిన గాలివాన కారణంగా రానున్న మూడు రోజుల ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో వేడిగాలులు తగ్గుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది.
రానున్న మూడు రోజుల పాటు వేడిగాలులు ఈ మూడు రాష్ట్రాల్లో కొనసాగుతాయని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో రాబోయే నాలుగు రోజుల పాటు ఇలాంటి వేడి వాతావరణం కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కోస్తా కర్ణాటకలో వడగాలులు వీస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment