సాక్షి, హైదరాబాద్ : అకాల వర్షాలతో సతమతమౌతున్న తెలుగు రాష్ట్రాలకు వాతారణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో శనివారం భారీ వర్షాలు కురిసే వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఈడెన్ వద్ద తుపాను కేంద్రం ఏర్పడిందని, నైరుతి దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని అధికారులు సూచించారు. తుఫాన్ కారణంగా సమీప ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని అన్నారు. దీని ప్రభావంతో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చిరించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment