ముంబై: మహరాష్ట్రలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ముంబై రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షం కారణంగా స్పైస్‌జెట్, విస్తారాతో పాటు పలు సంస్థలు విమానాలను దారి మళ్లించాయి.
వాతావరణ శాఖ బుధవారం ఉదయం ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల అనంతరం మధ్యాహ్నం నుంచి ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో భారీ వర్ష పాతం నమోదైంది. ములుండ్ దాని పరిసరాల్లో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
వాతావరణ శాఖ అధికారి సుష్మా నాయర్ మాట్లాడుతూ, ఉత్తర కొంకణ్ నుండి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలో తుఫాను ద్రోణి నడుస్తుందని చెప్పారు.
ఫలితంగా ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుందన్నారు. ఈ వారంలో కొంకణ్, గోవాలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె వావాతవరణ శాఖ అధికారి సుష్మా నాయర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment