
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా 6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. కోస్తాంధ్ర తీరంపైకి అల్పపీడనం చేరుకోవడంతో రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.