బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం విశాఖపట్నంలో వెల్లడించింది. విశాఖ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశగా వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది.
మరో 72 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ క్రమంలో కోస్తాంధ్ర వైపు పయనించే అవకాశం ఉందని చెప్పింది.